Homeసినిమా వార్తలుK Viswanath: దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ కన్నుమూత

K Viswanath: దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ కన్నుమూత

- Advertisement -

తెలుగు సినీ దర్శక దిగ్గజం.. ప్రఖ్యాతి గాంచిన రచయిత/నటుడు కే విశ్వనాథ్ ఇక మనకి లేరు. గత కొద్దికాలంలో వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ గారు కన్నుమూశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నెన్నో విజయాలు మరెన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. 50కి పైగా హిట్ సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయనకే సొంతం.

https://twitter.com/vamsikaka/status/1621214413972979712?t=gpCkAY2cjbY2n6ZZKWKcRA&s=19

కే విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం ఎంతటి పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా విడుదలై నిన్నటికి 43 ఏళ్లు. సరిగ్గే అదే రోజు ఆయన మరణించారు. కే విశ్వనాథ్ పేరు చెబితే శంకరాభారణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ మొదలగు సినిమాలు గుర్తుకు రాని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

1957లో తోడికోడళ్లు సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన కే విశ్వనాథ్.. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన తర్వాత తొలిసారిగా 1965లో అక్కినేని నాగేశ్వరరావుతో ఆత్మగౌరవం సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి 19, 1930న రేపల్లెలో జన్మించిన కే విశ్వనాథ్‌కు తొలి సినిమా తర్వాత వెంటనే అవకాశాలు రాలేదు.

READ  Kaikala Satyanarayana: ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ కన్నుమూత

శోభన్‌బాబు హీరోగా ఆయన తీసిన చెల్లెలి కాపురం. అందాల హీరో శోభన్ బాబుతో డీ గ్లామర్ రోల్ చేయించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన శారద, సిరిసిరి మువ్వ సినిమాలు చక్కని పేరు తెచ్చుకోవడంతో పాటు మంచి విజయాల్ని సాధించాయి. సిరిసిరి మువ్వ భారీ విజయం ఆయన దర్శక జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక శంకరాభారణం సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. పాశ్చాత్య సంగీతం మరియు సంప్రదాయ సంగీతం మధ్య వ్యత్యాసం గురించి చర్చించిన ఆ సినిమా కే విశ్వనాథ్ దర్శకత్వంతో పాటు జే వి సోమయాజులు నటన, మహాదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రం, జంధ్యాల మాటలకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

ఇక కమల్ హాసన్‌ – కే విశ్వనాథ్ లు కలిసి పని చేసిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్లు గా నిలిచాయి. వారిద్దరి కలయికలో వచ్చిన స్వాతిముత్యం సినిమా అప్పట్లోనే భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ ఇచ్చిన ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. ఇక ఆ తరువాత విడుదలైన స్వయంకృషి, స్వర్ణ కమలం, ఆపద్భాంధవుడు, స్వాతి కిరణం సినిమాలు కూడా విశ్వనాథ్ గారికి ఎనలేని గౌరవం తీసుకు వచ్చాయి. ఆయన తీసిన సిరివెన్నెల సినిమాతోనే దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటిపేరు సిరివెన్నెలగా మారింది.

READ  Waltair Veerayya and Veera Simha Reddy: ఆంధ్రలో జరగనున్న వాల్తేరు వీరయ్య - వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్స్

కే విశ్వనాథ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా.. హిందీలో కూడా తన సినిమాల్ని రీమేక్ చేసి విజయాలు సాధించారు. సిరి సిరిమువ్వను సర్గమ్‌గా, శుభోదయం సినిమాను కామ్‌చోర్‌గా, శంకరాభరణం సినిమాను సుర్ సంగమ్‌గా తెరకెక్కించారు.విశ్వనాథ్ గారికి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. 2016లో దేశ సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనకు లభించింది. దర్శక ధీరుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories