టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో భారీ పాన్ ఇండియన్ మూవీస్ పుష్ప 2, కన్నప్ప కూడా ఉంటాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.
రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి ఆదరణ అందుకున్నాయి. ఇక మరోవైపు కన్నప్ప మూవీ నుండి కూడా ఇటీవల రిలీజ్ అయిన పలువురు నటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే కోట్లాది రూపాయలు వెచ్చించి వేలాదిమంది శ్రమ పడి తెరకెక్కించే సినిమాల నుండి కొందరు దొంగతనంగా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తుండడం పలు సినిమాలకు తలనొప్పిగా మారాయి.
ఇక తాజాగా పుష్ప 2 ఐటెం సాంగ్ కి సంబంధించి అల్లు అర్జున్, శ్రీలీల ఫోటో ఒక లీక్ కాగా, కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ లీక్ అయింది. అయితే కన్నప్ప నుండి లీక్ పై టీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కాగా ఈ విధంగా తప్పుడు దారుల్లో కొందరు లీక్స్ చేస్తుండడం సినిమా ఇండస్ట్రీ కి మంచిది కాదని, ఇకపై ఇటువంటి జరుగకుండా చూడాలని పలువురు ఆడియన్స్ కోరుతున్నారు.