Homeసినిమా వార్తలుRC15: ఆర్ సి 15 సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసిన లీకైన...

RC15: ఆర్ సి 15 సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేసిన లీకైన వీడియోలు

- Advertisement -

రామ్ చరణ్, శంకర్ ల అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ సి 15 కి సంబంధించి తాజాగా షూటింగ్ నుంచి లీకైన కొన్ని వీడియోలు ఈ సినిమా పై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి. కాగా లీక్ అయిన ఫోటోలు విడియోల ద్వారా ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉండబోతుందని తెలుస్తోంది. శంకర్ సినిమాలలో సాధారణంగా సామాజిక అంశాలు ఉంటాయనేది విదితమే.

ఇక ఈ సినిమా షూటింగ్ రియల్ పబ్లిక్ ప్లేస్ లలో జరుగుతుండటం సినిమాకు బాగా వర్కవుట్ అవుతుంది. సహజ లొకేషన్లలో సినిమాని చిత్రీకరిస్తే అది ఎల్లప్పుడూ ప్రామాణికతను అందించటమే కాక తద్వారా సినిమా యొక్క నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

ఆర్ సి 15 యూనిట్ ఇటీవల కర్నూలు, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా కాన్సెప్ట్ కు సన్నివేశాలకు చాలా భారీ సంఖ్యలో ప్రజలు అవసరం, అందుకే షూటింగ్ సెట్స్ చూడటానికి వచ్చిన నిజమైన ప్రేక్షకులతో షూటింగ్ చేస్తున్నారు చిత్ర బృందం.

కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ నుంచి ఇటీవలే కాస్త విరామం తీసుకున్న దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వానీలతో ‘ఆర్ సి 15’ అనే మరో ప్రాజెక్టు మీద కొన్ని రోజులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని ఐకానిక్ చార్మినార్ నుంచి తీసిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు.

దక్షిణ భారత సినీ రంగంలోని అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ సి 15’ చిత్రాలు రెండింటికీ ఒకేసారి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ ఇటీవల తన ‘షేర్షా’ సహనటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పుడప్పుడే ఆమె షూటింగ్ లో పాల్గొంటారా అన్నది సందేహమే.

READ  Tholiprema: వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ అవుతున్న క్లాసిక్ బ్లాక్ బస్టర్ తొలిప్రేమ

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అటు సీబీఐ ఆఫీసర్ గా, ఇటు రాజకీయ నాయకుడిగా కూడా కనిపించనున్నారు. అంజలి, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు కూడా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  RRR: జపాన్ లో 114 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న 'ఆర్ఆర్ఆర్'


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories