కోలీవుడ్ యువ దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ అద్భుత దర్శకత్వ ప్రతిభ గురించి మన తెలుగు ఆడియన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇక ఇటీవల ఇలయదళపతి విజయ్ తో ఆయన తెరకెక్కించిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నారు లోకేష్. గతంలో కార్తీతో ఖైదీ, విజయ్ తో మాస్టర్, కమలహాసన్ తో విక్రమ్ సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నారు.
వాటి అనంతరం తన సినిమాటిక్ యూనివర్స్ కి శ్రీకారం చుట్టారు లోకేష్. ఈ నేపథ్యంలో తాజాగా డాన్స్ మాస్టర్ మరియు దర్శకుడు, నటుడైన రాఘవ లారెన్స్ తో తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు లోకేష్. బెంజ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. నిన్న లారెన్స్ బర్త్ డే స్పెషల్ రిలీజ్ అయిన ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.
కారణంతో పోరాడే యోధుడు సైనికుడి కంటే ఎక్కువ ప్రమాదకరం వెల్కమ్ టు మై సినిమాటిక్ యూనివర్స్ మాస్టర్ అంటూ లోకేష్ ఈ టీజర్ లో ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ మూవీకి లోకేష్ కథను అందించగా యువ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. మొత్తంగా లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ప్రస్తుతం రాఘవ లారెన్స్ కూడా చేరారు. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయవంతం అవుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.