Home సినిమా వార్తలు Puli Meka: మంచి స్పందన తెచ్చుకుంటున్న లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక వెబ్ సిరీస్‌

Puli Meka: మంచి స్పందన తెచ్చుకుంటున్న లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక వెబ్ సిరీస్‌

ఈ వారం ప్రారంభంలో జీ 5లో విడుదలైన లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక వెబ్ సీరీస్ అన్ని వర్గాల నుండి మంచి సమీక్షలు మరియు ప్రశంసలను అందుకుంటుంది. లావణ్య త్రిపాఠి ఒక ఐపీఎస్ అధికారి పాత్రలో ఒక సీరియల్ కిల్లర్‌ని ఎలాగైనా పట్టుకోవాలని కోరుకోవడం ఈ షో యొక్క ముఖ్యాంశం, చాలామంది ఇది లావణ్య నుండి కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని పేర్కొన్నారు.

జీ 5లో ప్రసారమవుతున్న పులి మేక వెబ్ సిరీస్ కు అనూహ్యంగా చాలా మంచి స్పందన వస్తోంది. కాగా మంచి ట్విస్ట్ లు మరియు ఆశ్చర్యకరమైన సన్నివేశాలు నిండిన పదునైన రచన ఉన్నందుకు గానూ ప్రశంసించబడుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఆది సాయికుమార్ ఫోరెన్సిక్ నిపుణుడిగా నటించడం విశేషం. అలానే సీనియర్ నటుడు సుమన్ పోలీస్ కమీషనర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో రాజా చెంబోలు మరియు సిరి హన్మంత్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఈ షోను కోన వెంకట్ నిర్మించగా, కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. చోటా ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. కె ప్రసాద్ గారి స్ఫుటమైన ఎడిటింగ్ ఈ షోకు గొప్ప విలువను జోడించింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లతో, తక్కువ ఎపిసోడ్ నిడివితో ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా వీక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని అంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version