యువ నటుడు విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ఇక తాజాగా తొలిసారిగా లేడీ గెటప్ తో విభిన్న కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అయ్యాడు విశ్వక్.
లైలా టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అందరిలో మంచి బజ్ అయితే ఏర్పరిచింది. ఇప్పటికే రిలీజ్ అయిన లైలా టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు కొద్దిసేపటి క్రితం మూవీ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్ లో విశ్వక్ సేన్ పోషించిన లేడీ గెటప్ ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సీన్స్, అలానే డైలాగ్స్ అయితే డబుల్ మీనింగ్ తో అడల్ట్ మాసాల మాదిరిగా ఉన్నాయి.
అయితే యువతని టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే కథ, కథనాలు ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ తెరకెక్కించినట్లు మనకు ట్రైలర్ ని బట్టి చూస్తే చాలా వరకు అర్ధం అవుతుంది. ఒకరకంగా లేడీ క్యారెక్టర్స్ లో నటించడం ఛాలెంజింగ్ విషయం అని చెప్పాలి. కాగా ట్రైలర్ లో విశ్వక్ సేన్ యాక్టింగ్ కామెడీ తప్ప మిగతా అంశాలు ఏవి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేవు.
రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. అందాల కథానాయిక ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన లైలా మూవీ ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి అయితే మొత్తంగా రిలీజ్ అనంతరం ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.