సినిమా పేరు: లైలా
రేటింగ్: 1.5 / 5
తారాగణం: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, బబ్లూ పృథివ్రాజ్ మరియు ఇతరులు
దర్శకుడు: రామ్ నారాయణ్
నిర్మాత: సాహు గారపాటి
విడుదల తేదీ: 14 ఫిబ్రవరి 2025
యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన మెకానిక్ రాకీ పెద్దగా ఆడలేదు, అనంతరం తెరకెక్కిన తాజా సినిమా లైలా పై ఆయన ఫ్యాన్స్ ఆశపెట్టకున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు బాగానే ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఈ మూవీ ద్వారా తొలిసారిగా లేడీ గెటప్ వేశారు విశ్వక్. మరి మంచి అంచనాలతో నేడు రిలీజ్ అయిన లైలా మూవీ ఎలా ఉందనేది పూర్తి రివ్యూలో చూద్దాం
కథ :
ఈ మూవీ మొత్తం కూడా సోను అనే లేడీస్ బ్యూటీ పార్లర్ నడిపే యువకుడి చుట్టూ తిరుగుతూ సాగుతుంది. చిన్నప్పటి నుండి తన తల్లితో మంచి అనుబంధం కలిగిన సోను పెద్దయ్యాక పార్లర్ పెట్టుకుంటాడు. అనుకోకుండా కొన్ని పరిస్థితుల వలన తన పేరుతో పాటు పార్లర్ కూడా ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంది.
దానితో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సడన్ గా లైలా అనే లేడీ గెటప్ వేయాల్సిన పరిస్థితి అతనికి ఏర్పడుతుంది. అనంతరం లైలా మొత్తంగా తన సమస్య నుండి ఎలా బయటపడి తన గోల్ ని సాధించారు అనేది మొత్తం సినిమా తెర పై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా హీరో విశ్వక్సేన్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ మూవీ ఫలక్నామా దాస్ మొదలుకుని ప్రతి చిత్రంతో నటుడిగా తనని తాను మెరుగుపరుచుకుంటూ మంచి పేరుతో కొనసాగుతున్నారు విశ్వక్. ముఖ్యంగా ఈ మూవీలో లైలా గా లేడీ గెటప్ లో విశ్వక్ బాగా యాక్ట్ చేసారు.
హీరోయిన్ గా చేసిన ఆకాంక్ష శర్మ కూడా తన అందం, అభినయంతో మెప్పించింది. బబ్లు పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్ తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన వినీత్ కుమార్, కామాక్షి భాస్కర్ల, పృథ్వీ తదితరులు ఓకే అనిపించారు.
విశ్లేషణ :
ముందుగా ఈ మూవీ యొక్క దర్శకుడు రామ్ నారాయణ్ గురించి చెప్పుకోవాలి. కథ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ దానిని ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా తెరకెక్కించిన కథనం మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేదు. ముఖ్యమంగా పాత్రల యొక్క ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ప్రెజెంటేషన్ వంటివి ఇంకా బాగా రాసుకుని ఉండాల్సింది. ఇక అభిమన్యు సింగ్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి.
అంతా చాలావరకు రొట్ట పాత పద్దతిలో సాగుతుంది మూవీ. ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగల విశ్వక్సేన్ వంటి నటుడిని లేడీ గెటప్ వేయించి కూడా సరైన విధంగా కాన్సెప్ట్ ని కథనాన్ని నడిపించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ఏ రేటెడ్ మూవీ అయినప్పటికీ కూడా వాటికి కొన్ని పరిధులు ఉంటాయి, అవి దాటి వల్గర్ గా చీప్ గా ఉండేలా కొన్ని డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెడతాయి.
ప్లస్ పాయింట్స్ :
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
- లైలా పాత్రను సరిగ్గా రాసుకోకపోవడం
- అసంబద్ధమైన డైలాగ్స్
- పాత మలుపులు / సన్నివేశాలు
- సంగీతం
తీర్పు :
మొత్తంగా విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మల కళాయిల్లో యువ దర్శకుడు రామ్ నారాయణ్ తీసిన లైలా మూవీ అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ తప్పించి మిగతాది అంతా కూడా పాత మసాలాలతో సాగె ఏమాత్రం ఆకట్టుకోని డ్రామా మూవీ అని చెప్పొచ్చు.