Homeబాక్సాఫీస్ వార్తలురూ. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన 'కుబేర'

రూ. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన ‘కుబేర’

- Advertisement -

ఇటీవల రిలీజ్ అయిన కుబేర మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ క్రైమ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి, అమీగోస్ క్రియేషన్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కుబేర మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ సినిమా మొత్తంగా ఆరు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్లో జాయిన్ అయింది. ఇప్పటికే తెలుగు వర్షన్ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ ల యాక్టింగ్ కి అందరి నుంచి మంచి పేరు అయితే లభిస్తోంది. 

ఇక ఈ సినిమాతో మొత్తంగా తన కెరీర్ లో నాలుగో  రూ.100 కోట్ల మూవీని సొంతం చేసుకున్నారు హీరో ధనుష్. గతంలో రాయన్, వాతి, తిరు సినిమాలు రూ. 100 కోట్లు దాటిన విషయం తెలిసిందే. మరి ఓవరాల్ గా కుబేర ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  'కుబేర' సెన్సార్ పూర్తి & రన్ టైం లాక్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories