టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కొంత గ్యాప్ అనంతరం తాజాగా నాగార్జున, ధనుష్ ల కలయికలో తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ సినిమా కుబేర. ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే కుబేర నుంచి రిలీజ్ గ్లింప్స్ టీజర్, పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్, శేఖర్ కమ్ముల గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కుబేర మూవీ వాస్తవానికి శివరాత్రి సందర్భంగా రిలీజ్ కావలసి ఉండగా రిలీజ్ వాయిదా వేశారు. కాగా తమ సినిమాని జూన్ 20న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మ్యాటర్ ఏమిటంటే, అజిత్ హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న ఇడ్లీ కడై మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది,
అయితే ఆ సమయానికి అజిత్ నటిస్తున్న గుడ్ బాడ్ అగ్లీ కూడా రిలీజ్ కానుండడంతో ధనుష్ మూవీ మరొకనెల పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనేది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. అదే జరిగి ఇడ్లీ కడై మే చివరికి వెళితే, అక్కడి నుండి కేవలం నెలరోజుల గ్యాప్ లోనే కుబేర వస్తుంది.
అయితే ఈ విధంగా ధనుష్ నటిస్తున్న రెండు మంచి ప్రాజక్ట్స్ నెల గ్యాప్ కూడా లేకుండా రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదని, వాటి మధ్య రెండు నుండి మూడు నెలల గ్యాప్ ఉండేలా చూసుకుంటే బాగుంటుందనేది కొందరు విశ్లేషకులు అంటున్న మాట. మరి ఈ సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు ఏమైనా ఉంటుందేమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.