టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన దేవర పార్ట్ 1 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో చిరు, చరణ్ లతో కొరటాల శివ తీసిన ఆచార్య మూవీ డిజాస్టర్ అవడంతో ఎలాగైనా దేవర తో బ్రేక్ అందుకోవాలని దీనిని ఎంతో జాగ్రత్తగా ఆయన తెరక్కించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అందరిలో అంతకంతకు అంచనాలు పెంచేసిన దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అయితే తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో మహేష్, ప్రభాస్ లతో కూడా మూవీస్ చేసే ఆలోచన ఉందని అన్నారు.
వారిద్దరితో తనకు మంచి అనుబంధం ఉందని, ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకెళ్తుండగా మహేష్ త్వరలో SSMB 29 తో పాన్ వరల్డ్ మూవీ చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా తనకు అవకాశం వస్తే ప్రస్తుత వారి స్థాయి, మార్కెట్ కి తగ్గట్లు మంచి కథలు సిద్ధం చేస్తానని అన్నారు కొరటాల. కాగా ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీతో మెగా ఫోన్ పట్టిన కొరటాల ఆ తరువాత మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ తీశారు. అందులో మిర్చి, భరత్ అనే నేను బ్లాక్ బస్టర్స్ అందుకోగా శ్రీమంతుడు అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది