Homeసినిమా వార్తలు'హిట్ - 3' లో కోలీవుడ్ స్టార్ కార్తీ 

‘హిట్ – 3’ లో కోలీవుడ్ స్టార్ కార్తీ 

- Advertisement -

నాని హీరోగా ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ హిట్ 3. గతంలో వచ్చిన హిట్ ఫ్రాంచైజ్ లోని రెండు మూవీస్ బాగానే విజయవంతం అవడంతో ఈ మూవీ పై మరింతగా ఆడియన్స్ లో అనుచరులు ఏర్పడ్డాయి. ఇటీవల హిట్ 3 నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. 

అయితే ఇందులో చూపించిన కొన్ని సీన్స్ ని బట్టి ఇది కొంత వయొలెంట్ గా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కూడా బాగానే రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ మే 1న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 

విషయం ఏమిటంటే, ఈ హిట్ 3 మూవీలో అడివి శేష్ ఒక చిన్న సీన్ లో కనిపించనుండగా కీలక సీన్స్ లో కోలీవుడ్ స్టార్ కార్తీ కనిపించనున్నారని తెలుస్తోంది. హిట్ సిరీస్ ఫ్రాంచైజ్ ని రాబోయే రోజుల్లో మరింతగా ఆడియన్స్ కి చేరువ చేసేందుకు ఇతర భాషల స్టార్స్ ని కూడా తీసుకునేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందట. 

READ  Mazaka Review : Engaging Comedy Entertainer మజాకా రివ్యూ : ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 

మొత్తంగా ఈ మూవీలోని కార్తీ ఎంట్రీ పెద్ద ప్లస్ అని, అయితే ఆయన పాత్ర ఎలా ఉంటుందని, ఓవరాల్ గా మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేవి తెలియాలి అంటే మరొక నెల రోజులు ఆగాల్సిందే. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories