టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తన జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. ఓవైపు తన పొలిటికల్ కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ త్వరలో తాను చేస్తున్న సినిమాల యొక్క మిగతా బ్యాలెన్స్ షూట్ ని కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక పవన్ చేస్తున్న మూడు సినిమాల పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం యువ దర్శకుడు సుజిత్ తో ఓజి, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, జ్యోతికృష్ణ తో హరిహర వీరుమల్లు సినిమాలు చేస్తున్నారు పవన్. వీటిలో మాస్ యక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీగా ఓజి తెరకెక్కుతోంది.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఓజి నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరచగా దీనిని 2025 మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే, ఓజి మూవీలో ఒక సాంగ్ ని కోలీవుడ్ యాక్టర్స్ లో ఒకరైన శింబు పాడనున్నారు. ఇప్పటికే ఆయన పేరు కన్ఫర్మ్ కాగా, ఆ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అద్భుతంగా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఓజి నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.