తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న కథానాయిక సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో చేసినతొలి చిత్రం ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సాయి పల్లవి, ఆ సినిమాలో భానుమతి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత నుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని వాటిని సద్వినియగపరుచుకుని నటిగా చక్కని ఇమేజ్ తో పాటు క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి, ఇటీవల రానా హీరోగా తెరకెక్కిన విరాట పర్వంతో మరోసారి తన నటనకు గాను ప్రశంసలు అందుకుంది.
అయితే లేటెస్ట్ గా ఆమె తమిళంలోచేస్తున్న మూవీ “గర్గి”. డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ సినిమాని2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు.గౌతమ్ రామచంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.కాళీ వెంకట్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం గర్గి మూవీ యూనిట్ సభ్యుల సమక్షంలో సూర్య, జ్యోతిక దంపతులు తమ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. సాయి పల్లవితో కలిసి చేస్తున్న ఈ ప్రాజక్ట్ తనకు ఎంతో నచ్చిందని, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుందని అన్నారు సూర్య,జ్యోతిక. సూర్య,జ్యోతిక నిర్మాతలుగా ప్రత్యేకమైన అభిరుచి కలవారు అని వాళ్ళు నిర్మించిన సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. మంచి ఉద్దేశంతో తీసే సినిమాలకు వారి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది.
ఈ విషయమై సాయి పల్లవి తన ఇన్స్టాగ్రామ్ లోఅనంతరం వారిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయటం జరిగింది.సాయి పల్లవి చేస్తున్న ప్రయత్నం సఫలమై మరిన్ని మంచి సినిమాలు తను చేయడానికి ఉపయోగపడాలి అని కోరుకుందాం.