ఐకాన్ స్టార్ అల్లు అర్జున లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని వై రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, అనసూయ, సునీల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పుష్ప 2 నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ఆకట్టుకుని ఆడియన్స్ లో మూవీ పై భారీ హైప్ ఏర్పరిచాయి.
ఇక తాజగా ఈమూవీ నుండి మాస్ నెంబర్ కిసిక్ సాంగ్ యొక్క ప్రోమోని రిలీజ్ చేసారు మేకర్స్. డీజే బీట్ తో రూపొందిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటూ ఫుల్ సాంగ్ పై మంచి హైప్ ఏర్పరిచింది. కాగా కిసిక్ ఫుల్ సాంగ్ ని రేపు రాత్రి 7 గం. 2 ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.
చంద్రబోస్ రచించిన ఈ పాటకు సుబ్లాషిణి ఆలపించారు. ఇక థియేటర్స్ లో ఈ మాస్ బీట్ సాంగ్ కి అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్స్ అదిరిపోవడం ఖాయం అంటున్నారు మేకర్స్. కాగా రేపు పుష్ప 2 మూవీ యొక్క వైల్డ్ ఫైర్ ఈవెంట్ ని చెన్నై లోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీ లో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి పుష్ప 2 మూవీని డిసెంబర్ 5న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.