Home సినిమా వార్తలు Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కి జాన్...

Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం గత వారం విడుదలై పేలవమైన సమీక్షలు, చెదురుమదురుగా ఆక్యుపెన్సీలను అందుకుంది. ఈ చిత్రం పాత తరహా కథ, సిల్లీ కథనం కారణంగా తీవ్రమైన విమర్శకులను అందుకుంది. అజిత్ నటించిన వీరమ్ (2014) చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఇంతకు ముందే తెలుగులో 2017లో పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో నిర్మించారు.

అయితే హిందీ వెర్షన్ లో కొన్ని మార్పులు చేసి పూజా హెగ్డే సోదరుడిగా వెంకటేష్ పాత్రను ఒరిజినల్ నుంచి మార్చారు. బాక్సాఫీస్ వద్ద చాలా డల్ గా మొదలైన ఈ సినిమా రంజాన్ రోజు మాత్రం మంచి జోరును కనబరచి ఆదివారం కూడా అదే ఊపును కొనసాగించి మాస్ సెంటర్ల మద్దతుతో మంచి వసూళ్లను నమోదు చేసింది.

అయితే సిటీలు మరియు ఎ సెంటర్లలో మాత్రం ఈ సినిమా అంతగా ప్రబావం చూపలేకపోయింది. మొత్తంగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఒక మోస్తరు వారాంతాన్ని కలిగి ఉంది మరియు భారతదేశంలో 68 కోట్ల నెట్ [80 కోట్ల గ్రాస్] వసూలు చేసింది. ఓవర్సీస్ లో కిసి కా భాయ్ కిసీ కి జాన్ 31 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.111 కోట్ల గ్రాస్ వరకూ ఉంటుంది.

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్ లతో పాటు ఈ చిత్రంలో భూమిక చావ్లా, పాలక్ తివారీ, షహనాజ్ గిల్, రాఘవ్ జుయాల్, జస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్, విజేందర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, యో యో హనీ సింగ్ అతిథి పాత్రల్లో నటించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version