ప్రస్తుతం ఓటిటి వినియోగం ఎంతో పెరిగింది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా పలు భాషల సినిమాలని ఆడియన్స్ అందరూ ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే ఆడియన్స్ ని అలరించి మంచి వ్యూస్ సొంతం చేసుకుంటూ మేకర్స్ కి ఓటిటి ప్లాట్ ఫామ్ వారికి బాగా పేరుని ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి.
ఇక ముఖ్యంగా మలయాళం చిత్ర పరిశ్రమ నుండి ఇటీవల పలు సినిమాలు థియేటర్స్ రిలీజ్ అనంతరం అటు ఓటిటి ఆడియన్స్ యొక్క ఆదరణ కూడా అందుకుంటున్నాయి. ఆ విధంగా తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కిష్కింధ కాండం. మంచి అంచనాలతో ఇటీవల థియేటర్స్ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే రూ. 76 లక్షలతో మొదలై రూ. 76 కోట్లకు చేరుకొని అద్భుత విజయం సొంతం చేసుకుంది.
మిస్టరీ తో కూడిన కథ, కథనాలతో ఆద్యంతం ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆడియన్స్ ముందుకి ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయరాఘవన్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.