యువ నటులు కిరణ్ అబ్బవరం మరియు కష్మిరా పరదేశి ప్రధాన పాత్రలలో నటించిన వినరో భాగ్యము విష్ణు కథ తాజాగా ఓటీటీలో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం తెలుగు భాషలో ఆహా వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. థియేటర్లలో చక్కని విజయం సాధించిన తరువాత ఇప్పుడు స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
వినరో భాగ్యము విష్ణు కథ అనేది యాక్షన్ మరియు థ్రిల్స్‌తో కూడిన ఒక ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా మంచి రన్‌ను సంపాదించింది మరియు ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి తయారైంది.
అనేక మంది విమర్శకులు మరియు ప్రేక్షకులు కూడా ఈ చిత్రంలోని నైబర్ నంబర్ అనే కాన్సెప్ట్ ను మెచ్చుకున్నారు. ఆ రకంగా మంచి మౌత్ టాక్ ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించడానికి దోహదపడింది.
కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా.. చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడుగా పని చేశారు.