Home సినిమా వార్తలు VBVK: కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ డే ఫస్ట్ షో ...

VBVK: కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

యువ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం “వినరో భాగ్యము విష్ణు కథ” ఈ రోజు మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. అద్భుతమైన ప్రచార కార్యక్రమాల తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంతో చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని స్క్రీన్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా, ఆ షోల నుంచి మంచి స్పందన వస్తోంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్కవుట్ అయిందని టాక్ రాగా.. ఇక సెకండాఫ్ కి కూడా డీసెంట్ రిపోర్ట్స్ కు వస్తున్నాయి. కాగా సెకండాఫ్ థ్రిల్లర్ అంశాలతో సాగుతుందని, చివరి 15 నిమిషాలు చాలా అద్భుతంగా వచ్చాయని సమాచారం. ఓవరాల్ గా ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా యొక్క టీజర్, ట్రైలర్, వాసవ సుహాస, ఓ బంగారం వంటి పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కిరణ్ అబ్బవరం సినిమాలన్నింటిలో మంచి పాటలు ఉంటాయి, ఇవి ఒక సినిమాకు అవసరమైన ప్రీ రిలీజ్ బజ్ ను తెస్తాయి.

ఎస్.ఆర్.కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఇలాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నే ప్రేక్షకులు ఆశించగా, ఈ సినిమాని అలాంటి అంశాలతో నింపినట్లు కనిపిస్తోంది. ప్రీమియర్స్ నుంచి వచ్చిన టాక్ నిజమైతే మహా శివరాత్రి వీకెండ్ అడ్వాంటేజ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. కష్మిరా పరదేశి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మురళీశర్మ కీలక పాత్రలో నటించారు. డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ డైరెక్టర్ కాగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version