Home సినిమా వార్తలు Kiran Abbavaram KA Teaser: ఇంట్రస్టింగ్ గా కిరణ్ అబ్బవరం’క’ టీజర్

Kiran Abbavaram KA Teaser: ఇంట్రస్టింగ్ గా కిరణ్ అబ్బవరం’క’ టీజర్

Kiran Abbavaram KA Teaser

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యువ నటుడిగా ఒక్కో సినిమాతో మంచి విజయాలను క్రేజ్ ను సొంతం చేసుకుంటూ కొనసాగుతున్నారు కిరణ్ అబ్బవరం. తొలిసారిగా రాజా వారు రాణి గారు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న కిరణ్, ఇటీవల రూల్స్ రంజన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. కాగా నేడు తన బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ క టీజర్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చారు కిరణ్.

తొలిసారిగా ఈ మూవీ ద్వారా పాన్ ఇండియన్ రేంజ్ లో ఆయన ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న క టీజర్ పలు అలరించే మాస్ యాక్షన్ అంశాలతో ఇంట్రస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా టీజర్ లో కిరణ్ యాక్టింగ్, డిఫరెంట్ స్టైల్ బాగున్నాయి. ఒక పోస్ట్ మ్యాన్ గా పనిచేసే వ్యక్తి పలు హత్యలు చేస్తుండడం, అసలు అతను ఎవరు, ఆ హత్యలు ఏంటి, ఆపై కథేంటి వంటి అంశాలపై ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ రూపొందింది.

ఈ టీజర్ ని బట్టి చూస్తే ఇది ఒక పీరియాడిక్ మూవీ అని తెలుస్తోంది. టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా బాగున్నాయి. మొత్తంగా క టీజర్ అందరినీ ఆకట్టుకుని ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. రూ. 20 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీని సుజీత్, సందీప్ అనే దర్శక ద్వయం తెరకెక్కిస్తుండగా కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ పై దీనిని చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version