Homeసినిమా వార్తలునేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సక్సెస్ అవడం పక్కా - కిరణ్ అబ్బవరం

నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా సక్సెస్ అవడం పక్కా – కిరణ్ అబ్బవరం

- Advertisement -

‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. తొలి చిత్రంతోనే అటు ఇండస్ట్రీ ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో సూపర్ హిట్ సాధించి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ‘సెబాస్టియన్’, ‘సమ్మతమే’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అంటూ వస్తున్నారు.

కిరణ్‌ హీరోగా తాజాగా నటించిన సినిమా “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు చిత్ర ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వదిలారు. ఇక ఇంటర్నెట్ లో అందుబాటులోకి వచ్చిన తరువాత “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ కూడా అయింది.

ట్రైలర్ బట్టి చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు స్పష్టం అవగా.. ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంతో తొలిసారి ఒక క్యాబ్ డ్రైవర్ గా మాస్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా నటించారు.

READ  ఖరీదైన బహుమతులు పొందిన సూర్య-కార్తీ సోదరులు

కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు. అయితే సెప్టెంబర్ 9వ తేదీన ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర ‘ సినిమాతో పాటుగా ‘ఒకే ఒక జీవితం’ చిత్రం కూడా విడుదల అవుతుండటం వల్ల విడుదల తేదీని ఈ నెల 16కు వాయిదా వేసి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కిరణ్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా సినిమా రిజల్ట్ పై యువ హీరో కిరణ్ అబ్బవరం పూర్తి నమ్మకంతో ఉన్నారు. రషెస్ చూసిన తర్వాత సినిమా ఔట్ పుట్ తో చాలా సంతృప్తి చెందారని సమాచారం. అందుకే ”డేట్ మారుతుంది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా” అని లోగడ కిరణ్ ట్వీట్ కూడా చేసారు. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాకి కిరణ్ స్వయంగా స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించడం మరో విశేషం.

READ  Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. నరేష్ రెడ్డి మూలే సహ నిర్మాతగా వ్యవహరించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేసారు. ఈ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం భారీ విజయాన్ని అందుకుంటారని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories