Homeకింగ్డమ్ : పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా  
Array

కింగ్డమ్ : పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా  

- Advertisement -

సినిమా పేరు: రాజ్యం

రేటింగ్: 2.75/5

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, మనీష్ చౌదరి మరియు ఇతరులు

దర్శకుడు: గౌతమ్ తిన్ననూరి

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

విడుదల తేదీ: 31 జూలై 2025

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కలయికలో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి గ్రాండ్ గా నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్సు ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇపుడు చూద్దాం. 

కథ

సూరి (విజయ్ దేవరకొండ) ఒక సాధారణ పోలీస్, అయితే అతడు ఒక సీక్రెట్ మిషన్ మీద బయల్దేరతాడు. మరి ఇంతకీ ఆ మిషన్ లో భాగంగా  అతడు కలిశాడా లేదా, మధ్యలో అతడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి ఏమి జరిగింది అనేది మొత్తం కూడా మూవీలో చూడాల్సిందే. 

నటీనటులు పెర్ఫార్మన్స్ :

ముఖ్యంగా ఈ మూవీలోని సూరి పాత్రలో విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ ఎంతో బాగుందని చెప్పాలి. కీలకమైన యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో తన నటన మరింత ఆకట్టుకుంటుంది. ఇక తన పాత్ర యొక్క పరిధి మేరకు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా బాగానే నటించింది.

ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నెగటివ్ పాత్ర చేసిన వెంకటేష్ తన పాత్రలో పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. అలానే సత్యదేవ్ తో పాటు ఇతర పాత్రధారులు అందరూ కూడా బాగా పెర్ఫార్మ్ చేసారు . 

విశ్లేషణ

బ్రిటిష్ వారి కాలంలో సాగె బ్యాక్ డ్రాప్ తో ఈ కథని రాసుకున్నారు దర్శకడు గౌతమ్ తిన్ననూరి. ప్రారంభం నుండి మూవీలో విజువల్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. హీరో, అతడి సోదరుడి మధ్యన ప్రారంభ సీన్స్ తో పాటు విలన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని అలరించే సీన్స్ తో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అలరిస్తుంది.

అనంతరం వచ్చే సెకండ్ హాఫ్ లో మరింత డ్రామా ఉంటుంది. సత్యదేవ్ కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ తో బాగానే ఉన్నప్పటికీ థ్రిల్లింగ్ కలిగించే అంశాలు మిస్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి, విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఇక సీక్వెల్ హుక్ సీన్ ఫోర్స్ చేసినట్లుగా అనిపించినప్పటికీ గొప్పగా ఇంట్రస్టింగ్ గా కూడా ఉండదు. 

ప్లస్ పాయింట్స్

  • విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్
  • ఫస్ట్ హాఫ్
  • విజువల్స్/అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

  • కథనంలో స్లో మోడ్
  • అవసరమైన భావోద్వేగం లేదు
  • అంత బలమైన విలన్లు లేరు

తీర్పు :

మొత్తంగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ కింగ్డమ్ చూడదగ్గ డ్రామా అని చెప్పవచ్చు. హీరో విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ తో పాటు విజువల్స్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కొన్ని యాక్షన్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నపప్టికీ పూర్తిస్థాయిలో అందరూ ఆశించే అంశాలు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories