Homeసినిమా వార్తలుఅఖిల్ ఏజెంట్ సినిమా పై శ్రద్ధ వహిస్తున్న నాగార్జున

అఖిల్ ఏజెంట్ సినిమా పై శ్రద్ధ వహిస్తున్న నాగార్జున

- Advertisement -

ఏజెంట్ సినిమా అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలనే ధ్యేయంతో ఈ సినిమాకి సంబందించి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రం అఖిల్ కెరీర్‌ దశా దిశను మార్చేసే చిత్రంగా అందరి చేతా అంచనా వేయబడింది. అందువల్ల తన కుమారుడి కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను నాగార్జున ఎట్టిపరిస్థితుల్లో అయినా విజయం సాధించే దిశగా నడిపించాలి అని నిర్ణయించుకున్నారు.

నాగార్జున ఈ సినిమా పనుల్లో చురుకుగా పాల్గొంటూ సినిమా ఎలా వచ్చింది అని దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ యొక్క అవుట్‌పుట్, షెడ్యూల్స్, అప్‌డేట్‌లు మొదలైనవాటిని నిరంతరం జాగర్తగా గమనిస్తూనే ఉన్నారట. అన్ని విషయాలూ చూసుకుని అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి ఆయన ఏజెంట్ చిత్ర బృందంతో కలిసి తగిన సలహాలు ఇచ్చి పుచ్చుకున్నట్లు సమాచారం.

ఏజెంట్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు కూడా తమ వైపు నుంచి అత్యుత్తమ స్థాయిలో ఫలితం వచ్చేలా చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిత్ర బృందం ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. అలాగే వారు ఎంత కష్టమైనా సరే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా సినిమాని అందించాలనుకుంటున్నారు. ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.. స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు చక్కని కామెడీ కూడా పండించగలరని మంచి ఇమేజ్ సంపాదించారు. ఏజెంట్ సినిమాలో కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండదని, ఆయన మార్కు పక్కాగా ఉంటుందని అంటున్నారు.

READ  Box-Office: లైగర్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డిటైల్స్

ఏజెంట్ సినిమా నిజానికి ఈ దసరా పండుగ సమయంలో విడుదల కావాల్సి ఉంది కానీ షూటింగ్ సమయంలో జరిగిన జాప్యం వలన సినిమాను వాయిదా వేశారు. ఏజెంట్ సినిమాని అత్యధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ తో నింపి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ తొందరపడి ముందుగా విడుదల చేయడానికి చిత్ర బృందం ఇష్టపడటం లేదు. ఈ చిత్రం 2023 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్కినేని నాగార్జున మరియు చిత్ర బృందం పట్టుదలను చూస్తుంటే.. ఏజెంట్‌ విజయానికి అన్ని విషయాలూ సరిగ్గా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఏజెంట్ అటు అఖిల్ ఇటు సురేందర్ రెడ్డి ఇద్దరికీ భారీ విజయం అందించడానికి సిద్ధంగా ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories