Homeసినిమా వార్తలువిక్రాంత్ రోణ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

విక్రాంత్ రోణ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

- Advertisement -

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్యాన్ ఇండియా చిత్రం “విక్రాంత్ రోణ” ద్వారా తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తంగా భారత దేశ సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈరోజు విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం.అవడానికి కన్నడ హీరో అయినా సరే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ” సినిమాతో విలన్ గా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

అప్పటి నుంచి సుదీప్ చేసిన కొన్ని కన్నడ సినిమాలు అడప దడపా తెలుగులో డబ్ అయ్యాయి. అంతే కాకుండా మధ్యలో బాహుబలి, సైరా వంటి తెలుగు సినిమాలలో సహాయక పాత్రలు కూడా చేశారు.అయితే చాలా కాలం తర్వాత “విక్రాంత్ రోణ” అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకే కాదు ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ మరియు పోస్టర్లు సినిమా మీద భారీగా అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.

READ  మరింత ఆలస్యంగా రానున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమా

కన్నడ దర్శకుడు అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దాదాపు 100 కోట్ల బడ్జెట్ వెచ్చించారని సమాచారం. ఈ సినిమాని జి స్టూడియోస్, సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, పివిఆర్ పిక్చర్స్ విడుదల చేస్తున్నాయి. సుదీప్ కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం మీద ఈరోజు ఓవర్సీస్ మరియు కర్ణాటకలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో వచ్చిన టాక్ ఎలా ఉంది అంటే.. విక్రాంత్ రోణ సినిమా ఒక విజువల్ అని, అంతే కాకుండా భారతీయ సినీ చరిత్రలో ఒక కలికితురాయి అని ప్రేక్షకులు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని చూస్తే గనక ఖచ్చితంగా 3Dలోనే చూడాలని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక రెగ్యులర్ రివ్యూయర్ల నుంచి కూడా విక్రాంత్ రోణ సినిమాకి చక్కని స్పందన లభిస్తుంది.ఈ సినిమా థియేటర్లో చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది అని విమర్శకులు చెప్పడం విశేషం. ఈ సినిమా అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాని థియేటర్లలో చూసి తీరాలని విమర్శకులు పేర్కొంటున్నారు.

READ  రామ్ చరణ్ - గ్లోబల్ స్టార్

మొత్తం మీద తొలి రోజు ఉదయం టాక్ చూస్తుంటే విక్రాంత్ రోణ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ టాక్ ఇలాగే కొనసాగి బాక్స్ ఆఫీస్ వద్ద కిచ్చా సుదీప్ రికార్డులు బద్దలు కొడితే అటు ఆయన అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆనందిస్తారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories