Homeసినిమా వార్తలుటెలివిజన్ ప్రీమియర్ లో సాధారణ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న కేజీఫ్-2

టెలివిజన్ ప్రీమియర్ లో సాధారణ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న కేజీఫ్-2

- Advertisement -

కన్నడ స్టార్ యశ్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం ఈ ఏడాదిలో భారతీయ సినిమా పరిశ్రమలోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా గత వారం ఈ సినిమా టీవీలో తొలిసారి ప్రసారం అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే…

ఈ ఏడాది యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. కన్నడ, తమిళ, హిందీ, తెలుగు ఇలా ప్రతి భాషలోనూ విశేష స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుని ఈ సంవత్సరం హయ్యెస్ట్ గ్రాసర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. మొత్తంగా దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 నిలిచింది.

రాకీ భాయ్ పాత్రలో పండిన హీరోయిజం.. ఆ పాత్రలో యశ్ అభినయం అద్భుతంగా ఉండి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ కు ప్రేక్షకులు శభాష్ అన్నారు. అయితే థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

READ  బిజినెస్ మ్యాన్ సీక్వెల్ కు అవకాశం ఉంది - పూరి జగన్నాథ్

ఇటీవల జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం అయ్యింది. ఇదే తొలి టీవీ ప్రీమియర్ కావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ సినిమాకు కేవలం 9.15 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇది మొదటి భాగం కంటే తక్కువ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కేజీఎఫ్ పార్ట్ వన్ 11.9 టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. అంత భారీ హిట్ అయిన సినిమాకు పార్ట్ వన్ కంటే తక్కువగా టీఆర్‌పీ రేటింగ్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇక మిగతా డబ్బింగ్ సినిమాల టీఆర్పీ రేటింగులు చూస్తే.. రోబో 19.4, బిచ్చగాడు 18.75, కబాలి 14.52 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి. ఆ రకంగా చూస్తే.. రొబో, బిచ్చగాడు సినిమాల్లో సగం టీఆర్‌పీ రేటింగ్ కూడా కేజీఎఫ్ 2కు రాకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉండగా . ఆర్ ఆర్ ఆర్ మరియు కేజీఫ్ -2 రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు మరియు ఓటిటీలో తలపడిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద కేజీఫ్-2 పై చేయి సాధించినా.. ఓటీటీ మరియు శాటిలైట్ టెలికాస్ట్ లో మాత్రం ఆర్ ఆర్ ఆర్ కె విజయం లభించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలు టీఆర్పీ రేటింగ్ 18.36 వచ్చిన సంగతి తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  లైగర్ సినిమా లాస్ - కంపెన్సేషన్ డిటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories