తాజాగా యువ నటుడు నితిన్ చేసిన మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా వెంకీ కుడుముల దీనిని తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.
ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించారు. అయితే దీనితో పాటు మరోవైపు వేణు శ్రీరామ్ తో తమ్ముడు మూవీ చేస్తున్నారు నితిన్. ఇందులో లయ ఒక కీలక పాత్ర చేస్తుండగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మరికొన్ని నెలల్లో ఆడియన్స్ ముకుందుకి రానుంది. అయితే దీని అనంతరం ఇప్పటికే బలగం వేణు తో ఎల్లమ్మ అనే మూవీ కమిట్ అయ్యారు నితిన్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించనున్నారు.
త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్న ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జెస్ట్మెంట్ కారణంగా ఆమె స్థానంలోకి తాజాగా కీర్తి సురేష్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి కి దర్శకుడు వేణు కథ కథనాలు మొత్తం వివరించి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారట.
అయితే ఇటీవల వివాహం అనంతరం ఒకింత సెలెక్టీవ్ గా సినిమాలు చేయాలనీ నిర్ణయించారట కీర్తి సురేష్. మరి ఎల్లమ్మ మూవీతో ఆమె ఎంత మేర క్రేజ్ సొంతం చేసుకుంటారో చూడాలి.