టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేష్ కెరీర్ పరంగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ మెప్పించి ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించిన కీర్తి సురేష్ తెలుగుతో పాటు ప్రస్తుతం హిందీ సహా పలు భాషల్లో హీరోయిన్ గా దూసుకెళ్తున్నారు.
ఇక తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ ని డిసెంబర్ 12న గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు కీర్తి సురేష్. వీరిద్దరి మధ్య ప్రేమ దాదాపుగా 15 ఏళ్లుగా కొనసాగుతోంది. వృత్తిరీత్యా పెద్ద వ్యాపారవేత్త అయిన ఆంటోనీ తట్టిల్ కుటుంబానికి, కీర్తి కుటుంబానికి ఎన్నో ఏళ్ళ నుండి మంచి అనుబంధం ఉంది. ఇక వీరిద్దరి వివాహ వేడుకలు మూడు రోజుల ముందు అనగా డిసెంబర్ 9 నుండి గోవాలో ఆరంభం అయ్యాయి.
కాగా రెండు కుటుంబాల సన్నిహితులు, బంధువులు మాత్రమే కీర్తి, ఆంటోనీ ల వివాహానికి హాజరయ్యారు. అలానే పలువురు సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఈ నూతన జంటకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా వివాహ శుభాకాంక్షలు తెలియచేసారు. కాగా తమ అభిమాన కథయికకు గ్రాండ్ గా వివాహం జరుగడంతో పలువురు కీర్తి ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.