Homeసినిమా వార్తలువరుస అవకాశాలతో నటి 'కయదు లోహర్'

వరుస అవకాశాలతో నటి ‘కయదు లోహర్’

- Advertisement -

కోలీవుడ్ యువ నటి కయదు లోహర్ ఇటీవల ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన డ్రాగన్ మూవీ ద్వారా యువతతో పాటు అన్నివర్గాల ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకున్నారు.

అంతకముందు తెలుగులో యువ నటుడు శ్రీవిష్ణు తో ఆమె చేసిన మూవీ అల్లూరి. అయితే ఆ మూవీ అప్పట్లో ఆడలేదు. అనంతరం ఒక మరాఠీ తో పాటు మలయాళ మూవీ కూడా ఆమె చేసారు.

అయితే తాజాగా రిలీజ్ అయిన డ్రాగన్ మంచి విజయం ఆమెకు నటిగా బాగా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ మూవీలో ఆమె ఆకట్టుకునే అందం, అభినయం అందరినీ అలరించింది.

ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కయదు కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ తీయనున్న ఫంకీ తో పాటు నవీన్ పౌలితో కలిసి ఇదయం మురళి, అలానే అధర్వ మురళితో ఒక మూవీ చేయనున్నారు. ఈ మూవీలో రాక్ స్టార్ ఎస్ థమన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

అలానే తాజాగా ఆమె శింబుతో పాటు జివి ప్రకాష్ కుమార్ లతో రెండు సినిమాలు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ యువ భామ వీటితో ఎంతమేర విజయాలు అందుకుంటుందో చూడాలి. 

READ  'కింగ్‌డ‌మ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి రెడీ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories