Homeసినిమా వార్తలుదీపావళికి రానున్న కార్తీ "సర్దార్*

దీపావళికి రానున్న కార్తీ “సర్దార్*

- Advertisement -

మంచి నటుడైన తమిళ హీరో కార్తీ “సర్దార్” అనే మరొక విభిన్నమైన సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు కార్తీ.తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ప్రతి సినిమాను కూడా అదే స్థాయిలో విడుదల చేస్తూ ఉంటారు.అదీ కాక తన సినిమాలని ఇక్కడ ప్రచారం చేసుకునే విధానంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు కార్తీ.

కార్తీ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది.అందుకే అతను తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా బాగా ఇష్టపడ తాడు కూడా. కార్తీ నటించిన “ఖైదీ”సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన “సుల్తాన్” ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఓపెనింగ్స్ మాత్రం పరవాలేదు అనిపించుకుంది.ఇక కార్తీ తదుపరి చేయబోయే సర్దార్ పైనే అందరి చూపు.

PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.రఫ్ లుక్ తో ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా కార్తీక్ కనిపించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన రాబట్టింది.

READ  మైత్రి మూవీ మేకర్స్ పై కేసు
https://twitter.com/AnnapurnaStdios/status/1541365470993031168?t=Qh5Ql87r0sjA4XrWU4TzwQ&s=19

ఇదిలా ఉండగా ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారని చిత్ర బృందం ప్రకటించారు.తమిళ సినిమాలకు దీపావళి పండగ పెద్ద సీజన్ అన్న సంగతి తెలిసిందే.ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను ప్రతిష్టాత్మక బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ దక్కించుకుంది.ఈ సినిమాలో కార్తీ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా,జీ వీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న సర్దార్ సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  థియేటర్లు మూసి వేయాల్సి వస్తుంది అంటున్న ఏపీ ఎక్జిబిటర్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories