Homeసినిమా వార్తలుఈ వారమే OTTలో విడుదల కానున్న కార్తీ విరుమాన్

ఈ వారమే OTTలో విడుదల కానున్న కార్తీ విరుమాన్

- Advertisement -

నటుడు కార్తీ తాజాగా నటించిన చిత్రం విరుమాన్, ఎం ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం, ఆగష్టు 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కార్తీ ఈ చిత్రంలో సరికొత్త మాస్ గెటప్ లో కనిపించారు. ఆయన అలవోకగా నటించిన విధానం వల్ల ఈ చిత్రం తప్పకుండా ఒకసారి చూడచ్చు అనే సమీక్షలను తెచ్చుకుంది. కాగా గ్రామీణ ప్రాంతాల కథలను, సహజసిద్ధమైన పాత్రలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ దరాన అదితి శంకర్‌ హీరోయిన్ గా నటించారు.

ఇక చిత్ర కథ విషయానికి వస్తే.. కార్తీ గ్రామంలో సంతోషంగా జీవించే వ్యక్తి పాత్రలో నటించారు. కాగా ఆయన తల్లి పాత్ర ఆత్మహత్యతో మరణించగా, తన తల్లి మరణానికి మరెవరో కాదు కన్న తండ్రే కారణమని తెలుసుకుంటాడు. అప్పటి నుండి, తండ్రీ కొడుకుల మధ్య సంబంధం చెడి దూరం పెరగడమే కాకుండా ఇద్దరు మధ్య ఓకే పోటీ ఏర్పడుతుంది.

ఇక విరుమాన్ చిత్రం OTT స్ట్రీమింగ్ వివరాలకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. సెప్టెంబర్ 11 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు OTT దిగ్గజం అయిన అమేజాన్ ప్రైమ్ ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

READ  రెమ్యునరేషన్ తగ్గించిన తెలుగు టైర్-2 హీరోలు

విరుమాన్ చిత్రం దర్శకుడు ఎం ముత్తయ్య మరియు కార్తీల కలయికలో వచ్చిన రెండవ సినిమా. విరుమాన్‌ చిత్రంలో ప్రకాష్ రాజ్, సూరి, కరుణాస్, వడివుక్కరసి, శరణ్య పొన్వన్నన్, మైనా నందిని, మనోజ్ భారతిరాజా, రాజ్‌కిరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఎస్‌కె సెల్వకుమార్ అందించగా, ఎడిటింగ్ వెంకట్ రాజన్ సమకూర్చారు. విరుమాన్ సినిమాకు సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. కాగా ఈ చిత్రానికి యువన్ అందించిన సంగీతం కార్తీ అభిమానులను, ఇతర సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జ్యోతిక, సూర్య తమ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ తమిళనాట విరుమాన్‌ సినిమాని పంపిణీ చేసింది. కార్తీ ప్రధాన పాత్రలో నటించిన విరుమాన్ కి థియేటర్లలో మంచి రన్ వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 11 నుండి అమెజాన్ ప్రైమ్‌లో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  తెలుగు సినిమాకు ఊపిరి పోసిన బింబిసార - సీతారామం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories