కార్తీ సర్దార్ మరియు శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాలు ఈ దీపావళికి తమిళంలో పోటీ పడ్డాయి. మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ I తర్వాత ఈ రెండు సినిమాలు విడుదలైనప్పటికీ, ఆ చిత్రం ఈ కొత్త విడుదలకు ఇప్పటికీ గట్టి పోటీని ఇచ్చింది.
ఈ సినిమాల విడుదలకు ముందు, ట్రేడ్ వర్గాలు మరియు సినీ ప్రేక్షకులు శివ కార్తికేయన్ ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా, మరియు దీపావళి పండుగ వారాంతంలో వల్ల కార్తీ సర్దార్ పై ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు.
అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రిన్స్ పరాజయం పాలయింది. కార్తీ సర్దార్ సినిమా దీపావళి విజేతగా నిలిచింది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్‌లో తన నటనకు ప్రశంసలు అందుకున్న కార్తీ, సర్దార్ లో కూడా తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఈ ఏడాది ఆయన హ్యాట్రిక్ విజయాలు కూడా సాధించాడం విశేషం.
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మొదట విరుమాన్ విజయం సాధించింది. తదుపరి పొన్నియిన్ సెల్వన్-1 మరియు తాజాగా సర్దార్ కూడా ఘన విజయం సాధించింది.
తమిళనాడులో 5 రోజుల వరకు ప్రిన్స్ 22 కోట్లు వసూలు చేయగా, సర్దార్ 26 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సర్దార్ దే పై చేయి కావడం విశేషం. ప్రిన్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.5 కోట్లు వసూలు చేయగా, సర్దార్ 10 కోట్లు వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కార్తీ అంటే విపరీతమైన అభిమానం, టాక్ బాగుంటే కార్తీ సినిమాకి మంచి లాంగ్ రన్ వస్తుంది.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఏరియాలలో ప్రిన్స్ 1.25 కోట్లు, సర్దార్ 3.5 కోట్లు వసూలు చేశాయి. ఓవర్సీస్‌లో చూసుకుంటే ప్రిన్స్ 6.5 కోట్లు వసూలు చేయగా, సర్దార్ 12 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రతి ఏరియాలోని ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ పై సర్దార్ డామినేట్ చేసింది. ఓవరాల్‌గా, ప్రిన్స్ ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల గ్రాస్ 34.25 కోట్లు కాగా సర్దార్ ఇప్పటివరకూ 51 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన సర్దార్ ఒక స్పై థ్రిల్లర్, ఇందులో కార్తీ రెండు పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా మరియు చంకీ పాండే కీలక పాత్రలలో నటించారు. ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ మరియు ఎడిటర్ రూబెన్ బృందంలో భాగంగా ఉన్నారు.