Homeసినిమా వార్తలుఉత్కంఠ రేపిన "కార్తికేయ 2" ట్రైలర్

ఉత్కంఠ రేపిన “కార్తికేయ 2” ట్రైలర్

- Advertisement -

నిఖిల్  సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’. దీనికి చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.యువ కథానాయకుడు నిఖిల్ మరియు దర్శకుడు చందు మొండేటి ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే ‘కార్తికేయ 2’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. 

‘కార్తికేయ 2’ ట్రైలర్ విషయానికి వస్తే… ‘శాంతను! ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే, ఆజ్యం మళ్ళీ అక్కడ మొదలైంది. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలం’ అని ఒక నటుడు చెప్పే డైలాగుతో ప్రారంభం అయ్యింది. ఆ యాగం ఎంటి ఎవరు ప్రారంభించారు? దాంతో హీరో నిఖిల్ కు ఉన్న సంబంధం ఎంటి? అనే ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం దొరుకుతుంది.భక్తి, సైన్స్ నేపథ్యంలో చందూ మొండేటి ఇది వరకే కార్తికేయ మొదటి భాగాన్ని తీసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగానికి ద్వారక నగరం,కృష్ణుడు కు సంబంధించిన నేపథ్యం అనడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.మరి ఆ అంచనాలను కార్తికేయ 2 అందుకుంటుందా లేదా చూద్దాం.

‘సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ఈ ద్వారకా నగరం’ అంటూ నిఖిల్ డైలాగ్‌తో కూడిన ‘కార్తికేయ 2’ మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

READ  విరాట పర్వంలో ఈ బూతులను సెన్సార్ కట్ చేసింది

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories