Home సినిమా వార్తలు కార్తికేయ – 2 ట్రైలర్: చరిత్రకి ఇతిహాసానికీ మధ్య యుద్ధం

కార్తికేయ – 2 ట్రైలర్: చరిత్రకి ఇతిహాసానికీ మధ్య యుద్ధం

kartikeya 2

చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో యువ హీరో నిఖిల్ హీరోగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్1 కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ ఆసక్తికరమైన డైలాగ్స్ తో సాగిన ట్రెయిలర్ 1 ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను ఆగస్ట్ 6న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. మరి ఈరోజు విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందంటే ..

“అయిదు సహస్రాల ముందు పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం అంటూ ఆసక్తికరంగా మొదలైన ట్రైలర్ అబ్బురపరిచే విజువల్స్ మరియు కట్టిపడేసే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. “నా వరకు వచ్చేవరకే అది సమస్య.. నా వరకు వచ్చాక అది సమాధానం” అంటూ హీరో నిఖిల్ ఈసారి కృష్ణ భగవానుడి గురించి ఏదో రహస్యాన్ని చేధించే పనిలో పడ్డట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ ట్రైలర్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మరియు మలయాళ తెలుగు నటుడు ఆదిత్య మీనన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు.

కార్తికేయ2 చిత్రం విడుదల తేదీ విషయంలో పలు మార్లు మార్పు జరిగిన విషయం తెలిసిందే. మొదట జూలై 22న విడుదల కావాల్సిన సినిమా ఆగస్ట్ 5న విడుదల అవుతుందని పుకార్లు వినిపించాయి. అయితే మళ్ళీ అధికారికంగా ఆగస్ట్ 12న విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో మళ్ళీ కాస్త అపశృతి దొర్లినట్లుగా ఆగస్ట్ 13కు మార్చబడింది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సీక్వల్ అంచనాలు అందుకుంటోందో లేదో.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version