Homeసినిమా వార్తలుBox-Office: ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కార్తికేయ-2

Box-Office: ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కార్తికేయ-2

- Advertisement -

2014లో విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది “కార్తికేయ”. కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను మాత్రమే కాకుండా.. ఒక వినూత్న ప్రయత్నంగా కూడా మంచి ప్రశంశలు అందుకుంది. అలాంటి విజయవంతమైన సినిమాకి సీక్వెల్ గా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గత వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా “కార్తికేయ 2”. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాలతో పాటు విడుదల తేదీకి సంభందించిన వాయిదాల మధ్య.. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా అనూహ్యంగా విజయాన్ని సాధించి అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమా విడుదలైన మొదటి రోజు “కార్తికేయ 2” కేవలం 7 లక్షలు మాత్రమే కలెక్షన్లు నమోదు చేసుకుంది. హిందీలో పెద్దగా ప్రచారం లేకపోవడం, అలాగే ధియేటర్లు కూడా చాలా తక్కువ అవడంతో మొదటి రోజు నామమాత్రపు కలెక్షన్లు వచ్చాయి. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి సినిమాకి అద్భుతమైన టాక్ రావడం, అంతే కాక సినిమాలో హీరో నిఖిల్ తో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా సినిమాకి ధియేటర్లు పెంచాలంటూ డిమాండ్ చేశారు. దాంతో రెండవ రోజు నుంచి సినిమా కలెక్షన్లు మరియు స్క్రీన్లు అలా పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ శుక్రవారం జన్మాష్టమి సందర్భంగా కలెక్షన్లు బాగుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

నిజానికి ఏ సినిమా అయినా విడుదలైన మొదటి రోజు నుంచి కలెక్షన్లు తగ్గుతూ వస్తాయి. కానీ “కార్తికేయ 2” విషయంలో అది రివర్స్ అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ వారం కార్తీకేయ 2 కలెక్షన్లు పెరిగాయి. విడుదలైన ఆరు రోజులకు అంటే గురువారం వరకు సినిమా 5.75 కోట్లను నెట్ కలెక్షన్లు సంపాదించింది. ఇక శుక్రవారం 2.46 కోట్లను నమోదు చేయగా, నిన్న శనివారం ఏకంగా 3.04 కోట్ల నెట్ రాబట్టడం విశేషం. బాలీవుడ్ సినిమాలు లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ వంటి సినిమాల కంటే ఇది రెట్టింపు కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.

READ  మరో భారీ సినిమాని చేజిక్కుంచుకున్న అనిరుధ్

ఇటు మన తెలుగు రాష్ట్రాలు, అటు ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణతో పాటు ఓవర్సీస్ లో కూడా విజయ ఢంకా మోగిస్తోంది కార్తికేయ 2 చిత్రం. శనివారం దాదాపు $150K కలెక్ట్ చేసిన కార్తికేయ 2, మొత్తంగా ఒక వారం నాటికి ఓవర్సీస్ లో $915k నంబర్ ను క్రాస్ చేసింది, ఇంకా కొన్ని లోకేషన్ల నుంచి కలేక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం వన్ మిలియన్ (1M) ఫిగర్ ను సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అంతే కాకుండా ఈ ఏడాది (2022)లో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో RRR($705k) మొదటి స్థానంలో ఉండగా, కార్తికేయ 2 సినిమా రెండవ స్థానంలో నిలిచింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office: లైగర్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ డిటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories