Homeసినిమా వార్తలుకంటెంట్ ఏ హీరో అని నిరూపిస్తున్న కార్తీకేయ-2.. లైగర్

కంటెంట్ ఏ హీరో అని నిరూపిస్తున్న కార్తీకేయ-2.. లైగర్

- Advertisement -

కరోనా దాడుల అనంతరం అన్ని సినీ పరిశ్రమలు కొన్ని రోజులు గడ్డు కాలాన్ని ఎదురుకున్నాయి. ఒక దశలో సినిమాలు విడుదల చేయాలంటే అటు నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లకు కూడా వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే మారిన ప్రేక్షకుల అభిరుచుల కారణంగా కొన్ని రోజులు నిజంగానే కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ.. బాలీవుడ్ మినహా మిగతా పరిశ్రమలు వరుస విజయాలతో ఒక కొలిక్కి వచ్చాయి.

ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్టు నెల అత్యంత విజయవంతమైన సినిమాలను అందించింది. మొదటి వారంలో బింబిసార, సీతా రామం సినిమాలు అద్భుతమైన స్పందనను సొంతం చేసుకున్నాయి. అటు విమర్శకుల ప్రశంసలు, ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించి పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చాయి.

ఇక ఆ తరువాతి వారం విడుదలైన కార్తీకేయ 2 సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకృష్ణుని తదనంతరం దాచి ఉంచిన ఒక కంకణం అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విశేష స్థాయిలో ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. తొలి రోజు చాలా తక్కువ స్రీన్లతో ప్రారంభం అయినా, మౌత్ టాక్ విపరీతంగా ఉండటం వలన స్క్రీన్ లను పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు మూడు వేల సీన్లలో ప్రదర్శింపబడుతుంది. రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ లోపే హిందీ మార్కెట్ లో 25 కోట్ల గ్రాస్ కు పైగా రాబట్టింది.

READ  రామారావు అన్ డ్యూటీ ప్రి రిలీజ్ బిజినెస్ డిటైల్స్

ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా ‘లైగర్’. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి-చార్మి, కరణ్ జోహార్ తో పాటు అపూర్వ మొహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆగస్టు 25న మరి కొన్ని గంటల్లో థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి కూడా హిందీ ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. కార్తీకేయ 2 విజయం సాధించడానికైనా, ఇప్పుడు లైగర్ సినిమాకి క్రేజ్ రావడనికైనా ఒకటే కారణం.

సరైన కంటెంట్ ఉంటే మాత్రమే హిందీ మార్కెట్లో సినిమాకు విజయం దక్కుతుంది. చిన్న హీరోల దగ్గరనుంచి బాలీవుడ్ స్టార్ లు కూడా ప్రేక్షకులను థియేటర్లలోకి తీసుకురావడంలో విఫలమవుతున్న తరుణంలో.. కార్తికేయ2 ఎటువంటి భారీ ప్రమోషన్లు లేకుండా ఇంత పెద్ద విజయం సాధించింది. పైగా ఇప్పుడు లైగర్ బుకింగ్స్ కూడా బాగా ఉన్నాయి, ఉత్తరాదిన ఈ చిత్రం లాభసాటి బేరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోల కంటే కంటెంట్ ముఖ్యమని ఈ రెండు చిత్రాలకి దక్కిన ఆదరణ రుజువు చేస్తోందనే చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా జల్సా సినిమా స్పెషల్ షోలు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories