Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: కార్తీకేయ-2 16 డేస్ కలెక్షన్స్

Box-Office: కార్తీకేయ-2 16 డేస్ కలెక్షన్స్

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయత్నాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తోన్న హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ మొదట్లో కాలక్షేపంతో కూడిన మాస్ సినిమాలు మాత్రమే చేసిన నిఖిల్.. స్వామి రా రా చిత్రంతో తన శైలిని మార్చుకుని ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త రకమైన అనుభూతిని ప్రేక్షకులకు అందజేస్తూ వచ్చారు. అందువల్ల ఆయన కెరీర్ లో ఎక్కువ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.

కరోనాకు ముందు నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాస్త గ్యాప్ తరువాత తన కెరీర్ లోనే పెద్ద హిట్ అయిన కార్తీకేయ (2014) చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో కూడా చక్కని ఆసక్తి ఏర్పడింది. విడుదల తేదీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఈ ఆగస్ట్ 13న ‘కార్తికేయ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. అద్భుతమైన టాక్ కు తగ్గట్లే కలెక్షన్లు కూడా నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో వస్తున్నాయి. విడుదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా తన జోరును కొనసాగిస్తూ వస్తుంది. ‘కార్తికేయ 2’ 16 రోజుల వరకు ఎంత వసూలు చేసిందంటే..

కార్తికేయ-2 మూడవ వారాంతంలో అద్భుతమయిన వసూళ్లు రాబట్టింది. ఈ వారం విడుదలైన లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో, శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యం నిరాటంకంగా చెలాయించింది, 16 రోజుల వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి 100 కోట్ల మ్యాజికల్ నంబర్ వైపు దూసుకుపోతోంది. ఇక షేర్ విషయానికి వస్తే షేర్ 48.5 కోట్ల వరకూ సాధించింది. అందులో తెలుగు వెర్షన్ షేర్ మాత్రమే దాదాపు 37 కోట్లు వసూలు చేసిందంటే ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇది నిఖిల్‌కి తొలి 100 కోట్ల గ్రాసర్ తో పాటు తొలి 50 కోట్ల షేర్ సాధించిన సినిమాగా నిలుస్తుంది.

READ  Box-Office: కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచిన బింబిసార

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తీకేయ-2 చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

Follow on Google News Follow on Whatsapp

READ  NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories