కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ కార్తీక్ ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తున్నారు. అనంతరం ఆయన మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో తీయనున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలో భాగంగా ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టితో జై హనుమాన్ మూవీ, అలానే మహాకాళి మూవీస్ ని కమిట్ అయ్యారు ప్రశాంత్ వర్మ.
అందులో ముందుగా జై హనుమాన్ మూవీ రూపొందనుండగా దాని అనంతరం కార్తీతో ఆయన సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం దానికి సంబంధించి వారిద్దరి మధ్య కథాచర్చలు జరుగుతున్నాయనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఆకట్టుకునే కథనాలతో దీనిని తెరకెక్కించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట.
కాగా అన్ని అనుకున్నట్లు జరిగితే అటు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ తో పాటు ఇటు ప్రశాంతవర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా కార్తీక భాగం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.