కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ హీరోగా రాశి ఖన్నా, రాజీషా విజయన్ హీరోయిన్స్ గా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై ఎంటర్టైనర్ మూవీ సర్దార్. 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ పోషించారు.
ఇక తాజగా దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న మూవీ సర్దార్ 2. ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ప్రోలాగ్ వీడియో ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు.
ఇక ఈ గ్లింప్స్ లో విలన్ గా నటుడు ఎస్ జె సూర్యని పరిచయం చేసారు. ముఖ్యంగా కార్తీ కత్తి పట్టుకుని యోధుడిగా ఇచ్చిన పవర్ఫుల్ ఎంట్రీ గ్లింప్స్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. ఒకసారి స్పై అయితే అతడు ఎప్పటికీ స్పై నే అంటూ కార్తీ ఫస్ట్ పార్ట్ లో చెప్పిన డైలాగ్ ని ఇందులో కూడా చూపించారు.
మొత్తంగా ఈ యాక్షన్ గ్లింప్స్ అందరిలో మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసిందని చెప్పాలి. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కార్తీకి జోడీగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీని ఆడియన్స్ ముందూకి తీసుకురానున్నారు.