Home సినిమా వార్తలు Karthi in Surya Kanguva సూర్య ‘కంగువ’ లో కార్తీ బ్లాస్ట్

Karthi in Surya Kanguva సూర్య ‘కంగువ’ లో కార్తీ బ్లాస్ట్

surya karthi

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ పై ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో నిర్మితమవుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా నటరాజన్ సుబ్రహ్మణ్యం, జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

నేడు సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫైర్ సాంగ్ ని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విషయం ఏమిటంటే, రెండు పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకి రానున్న కంగువ మూవీ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో సూర్య తమ్ముడు కార్తీ క్యామియో పెర్ఫార్మన్స్ అదిరిపోతుందట.

అలానే సూర్య తో పాటు కార్తీ పాత్ర పార్ట్ 2 లో మరింతగా సాగుతుందని, మొత్తంగా కంగువ లో హీరో కార్తీ విజువల్ బ్లాస్ట్ ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ అని అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. కాగా కంగువ పార్ట్ 1 మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కంగువ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version