Homeసినిమా వార్తలు777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

- Advertisement -

గత వారం విడుదలైన కన్నడ చిత్రం 777 చార్లీ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ట్రైలర్ లో హీరోతో సమానంగా కుక్కకు ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ ఆకర్షించింది. కన్నడ హీరో రక్షిత్ షెట్ తన ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుంటారు.

కరోనా ముందు విడుదల అయిన అవనే శ్రీమన్నారాయణ సినిమాకి కూడా అటు ప్రేక్షకుల నుంచి ఇటు విమర్శకుల మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు 777 చార్లీ కి అటు కన్నడ భాష లోనే కాక తెలుగు,తమిళ,హిందీ ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభించింది.

ఇంతకు ముందు కూడా మనిషికి కుక్కకి మధ్య అనుబంధం ఉన్న సినిమాలు వచ్చినా, చాలా వరకు అందులో హీరో లేదా ముఖ్య పాత్ర అయిన మనిషి పట్ల కుక్కలకు ఉండే విశ్వాసం మీదే ఎక్కువ దృష్టి పెట్టే వారు. కానీ చార్లీలో అందుకు భిన్నంగా హీరో పాత్ర, అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన కుక్క మీద ఎలా ప్రేమను పెంచుకున్నాడు అనే విషయాన్ని చూపించింది.

READ  నాని మార్కెట్ మీద డౌట్ పడుతున్న ప్రోడ్యూసర్ లు

ఇలాంటి కాన్సెప్ట్ ను ఎంచుకోవడం ఒక రకంగా సాహాసమే అయినా దర్శకుడు కిరణ్ రాజ్, హీరో రక్షిత్ షెట్టి మనసు పెట్టి తీయడం వల్లే ఈరొజు సినిమాను చూసిన ప్రేక్షకులు అందులోని ఎమోషన్ కు కనెక్ట్ అయి ధియేటర్ లలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఇటీవల ఈ సినిమాను కర్ణాటక ముఖ్య మంత్రి బసవరాజ్ బొమ్మై వీక్షించారు. అయితే స్వతహాగా జంతు ప్రేమికుడు అయిన ఆయన చార్లీ చూసి కదిలిపోయారు అనీ, సినిమా పూర్తి అయ్యాక ఏడుస్తూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయారు అని తెలుస్తుంది. సినిమా చూశాక ఆయనకు తన ఒకప్పటి పెంపుడు జంతువు గుర్తుకు వచ్చిందట. లోగడ హోం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోగా, ఆ పిక్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  ఓటీటీ లో జయమ్మ పంచాయితీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories