Homeసినిమా వార్తలుకాంతార OTT రిలీజ్ డేట్ - స్ట్రీమింగ్ పార్టనర్ డీటైల్స్

కాంతార OTT రిలీజ్ డేట్ – స్ట్రీమింగ్ పార్టనర్ డీటైల్స్

- Advertisement -

కాంతార సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కాంతార చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటున్నారు. కన్నడ నుండి వచ్చిన ఈ చిత్రాన్ని కెజిఎఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. కాగా ఈ చిత్రం తెలుగులో ఇప్పటికే 25 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలకు స్వీట్ షాక్ ఇచ్చింది.

మరోవైపు ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.

అయితే ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సినిమా నవంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుందని వార్త వైరల్ అవుతుండగా.. దీనిపై చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ ఇటివలే ట్విట్టర్‌లో స్పందించారు.

నవంబర్ 5 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవాస్తవమని, ఓటీటీలో సినిమా ఎప్పుడు వస్తుందనేది ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కానీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ఈ వార్తల్లో నిజం ఉందని, మరియు ఒప్పందం ప్రకారం కాంతార నవంబర్ 5న OTT lo ఖచ్చితంగా విడుదల అవుతుందని అంటున్నారు.

ఒకవేళ వార్తల్లో ఉన్న తేదికే కాంతార సినిమా OTT lo వస్తే.. థియేట్రికల్ విడుదలకు మరియు OTT విడుదలకి మధ్య 5 వారాల గ్యాప్ ఉంటుంది, ఇది ఒక యావరేజ్ సినిమాకి ఐతే పర్వాలేదు కానీ కాంతార చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి పోటీ లేకపోవడంతో రాబోయే వారాల్లో కూడా మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.

READ  స్టార్ వాల్యూ కన్నా కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రేక్షకులు

అలాంటి సినిమాని ఇంత తొందరగా OTT లో విడుదల చేసే నిర్ణయాన్ని చిత్ర నిర్మాతలు వాయిదా వేసి ఉండాల్సిందని సినీ అభిమానులు మరియు పరిశ్రమ వర్గాల వారు కూడా భావిస్తున్నారు.

కాగా కాంతార చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేశారు. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ బలమైన టాక్ వల్ల ఈ నెల 15న తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్లు రాబడుతోంది.

నిజానికి కాంతార సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్లు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలియదు కానీ అధ్భుతమైన కంటెంట్ కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ కన్నడ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లు వసూలు చేసింది.

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన వి.వి వినాయక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories