Homeసినిమా వార్తలుభారీ ధరకు అమ్ముడయిన కాంతార తెలుగు శాటిలైట్ హక్కులు

భారీ ధరకు అమ్ముడయిన కాంతార తెలుగు శాటిలైట్ హక్కులు

- Advertisement -

కన్నడ డబ్ సినిమాగా విడుదలై తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది తాజా సంచలన చిత్రం కాంతార. ఈ సినిమా కలెక్షన్లు తెలుగు టైర్2 హీరోల బిగ్గెస్ట్ హిట్స్‌తో సమానంగా ఉన్నాయి. తెలుగు డబ్ వెర్షన్లో ఇప్పటికే కాంతార సినిమా దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా తెలుగులో కొత్తగా విడుదలయిన సినిమాలతో పోలిస్తే ఇప్పటికీ మెరుగ్గా నడుస్తోంది.

వెండితెర పై భారీ విజయాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్న కాంతార సినిమా తెలుగు డబ్ శాటిలైట్ హక్కులు తాజాగా అధిక ధరకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.

కాంతార (తెలుగు డబ్) శాటిలైట్ హక్కులు స్టార్ మాకి 4.5 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అవకాశం ఉన్న ఈ చిత్రం థ్రిల్లర్ మరియు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అంశాలతో సమతుల్యంగా ఉంటుంది. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇటీవల, దాని OTT స్ట్రీమింగ్ ప్రీమియర్ కు కూడా సిద్ధం కాగా.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న కారణంగా వాయిదా పడింది. వాస్తవానికి నవంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, నవంబర్ 18కి వాయిదా పడింది. ఆ తరువాత మళ్ళీ నవంబర్ నెలాఖరుకి మార్చబడింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది.

రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కాంతార ఫాంటసీ అంశాలతో కూడిన థ్రిల్లర్ గా రూపొందింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో సప్తమి గౌడ కథానాయికగా నటించారు. సినిమా మొత్తం కర్నాటక అడవుల నేపథ్యంలో సాగింది, అందుకే దీనికి కాంతార అనే పేరు వచ్చింది, దీని అర్థం ‘ఆధ్యాత్మిక అడవి’. కాంతారలోని రహస్యాల కోసం మరియు థ్రిల్ పొందడం కోసం ప్రేక్షకులు బుల్లితెర ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నారు.

READ  బాక్సాఫీస్ వద్ద తగ్గని కాంతార జోరు.. 300 కోట్ల వసూళ్లు

ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో పాతుకుపోయిన సంస్కృతిని మిళితం చేస్తుంది. చాలామంది రంగస్థలం సినిమాతో ఈ సినిమాకి సారూప్యతలను కనుగొన్నారు, అయితే సినిమా పై మొత్తంగా ప్రేక్షకుల తీర్పు అద్భుతంగా ఉంది. ఆ రకంగా సినిమాను ఎంత ప్రాంతీయంగా తీస్తే అంత సార్వత్రికంగా ఉంటుంది అన్న ఈ చిత్ర దర్శకుడు, కథానాయకుడు అయిన రిషబ్ శెట్టి మాటలను నిజం చేసింది.

Follow on Google News Follow on Whatsapp

READ  బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా దూసుకుపోతున్న కాంతార


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories