Homeబాక్సాఫీస్ వార్తలుతెలుగు వెర్షన్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన కాంతార

తెలుగు వెర్షన్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన కాంతార

- Advertisement -

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి తానే దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో పాటు భారీ స్థాయిలో ప్రసంశలను కూడా అందుకుంటుంది.

కాంతార చిత్రం కన్నడ వెర్షన్ మొదటి రోజు దాదాపు 2.5 కోట్ల గ్రాస్‌ ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగింది. అయితే ప్రేక్షకుల నుండి సంచలనాత్మక టాక్ సహాయంతో, ఈ చిత్రం తదుపరి స్థాయికి చేరుకుంది. కాగా మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంతార చిత్రం కర్ణాటకలో రెండవ వారాంతంలో KGF-2 కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. మరియు ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు నమోదు చేస్తున్న సంఖ్యల కంటే చాలా ఎక్కువ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.

ఇక కాంతార సినిమా హిందీ, తెలుగు వెర్షన్లలో ఈ వారమే విడుదలైంది. హిందీ వెర్షన్ మొదటి రోజు 1.3 కోట్ల నెట్ వసూలు చేసింది, గ్రాస్ దాదాపు 1.6 కోట్ల వరకూ ఉంటుంది. ఇక తెలుగు వెర్షన్ కి వస్తే కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిందని చెప్పాలి. తెలుగు వెర్షన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ కన్నడ వెర్షన్ మరియు హిందీ వెర్షన్ లలో సాధించిన గ్రాస్‌తో సమానంగా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్‌తో ప్రారంభమైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అద్భుతమైన ఆదరణ వల్ల మొదటి రోజునే బ్రేక్‌ ఈవెన్ అమౌంట్ ను రికవరీ చేసింది.

READ  పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

ఇటీవలే ‘కేజీఎఫ్-2’ వంటి పాన్-ఇండియన్ హిట్ సినిమాను నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబలే ఫిల్మ్స్ పతాకం పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ “కాంతార” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం యొక్క కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలైంది కాగా ఈ చిత్రం తెలుగు, మలయాళం మరియు హిందీ భాషలలో నిన్న (అక్టోబర్ 15) విడుదలైంది.ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన ప్రతిచోటా సంచలనం సృష్టించింది.

థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తోంది. ముఖ్యంగా కాంతార యొక్క క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులపై అధివాస్తవిక ప్రభావాన్ని చూపుతోంది. అంతే కాక వారు థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు.

కాంతార చిత్రంలో కంబాల ఛాంపియన్‌గా ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి ఈ సినిమాకు రచనతో పాటు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో అటవీ అధికారిగా కిషోర్, భూస్వామి పాత్రలో అచ్యుత్ కుమార్ మరియు కథానాయిక పాత్రలో సప్తమి గౌడ నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  మాకు పెళ్ళై ఆరేళ్లు అయింది అంటున్న నయనతార - విఘ్నేష్ శివన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories