Homeసినిమా వార్తలుKantara: రెండు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలవుతున్న కాంతార.. వర్కవుట్ అవుతుందా?

Kantara: రెండు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలవుతున్న కాంతార.. వర్కవుట్ అవుతుందా?

- Advertisement -

రిషబ్ శెట్టి నటించిన కాంతార ఆయన కెరీర్ లో ఒక మైలురాయి ప్రాజెక్ట్ గా నిలిచి మంచి ప్రశంసలు మరియు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమాను రెండు ఇంటర్నేషనల్ మార్కెట్లలో విడుదల చేయడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ఇటాలియన్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఇటలీ, స్పెయిన్ లు అనేవి పూర్తి భిన్నమైన మార్కెట్లు. మరి అలాంటి చోట్ల వద్ద ఈ చిత్రం ఎలా రాణిస్తుందో చూడాలి. ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిన్న చిత్రం అనూహ్యమైన అసాధారణ సమీక్షలు, బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ రెండింటినీ సాధించాయి.

కర్ణాటక తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ కు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఏ ప్రాజెక్ట్ అయినా విజయం సాధించడం వెనుక కంటెంట్ అనేది అతి పెద్ద ఫ్యాక్టర్ అని ఈ సినిమా విజయం మరోసారి రుజువు చేసింది.

READ  Naresh: నటుడు నరేష్, పవిత్రల వివాహం నిజమా ఒక సినిమా పబ్లిసిటీ స్టంట్ ఆ?

ఇప్పుడు శాండల్ వుడ్ లో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది కాంతార. కర్ణాటకలో టాప్ షేర్, టాప్ ఫాలోయింగ్ వంటి రికార్డులన్నీ ఈ యాక్షన్ థ్రిల్లర్ తోనే ఉండడం విశేషం. ఈ చిత్రం కర్ణాటకలో కేజీఎఫ్ 2 గ్రాస్ కలెక్షన్లు, షేర్స్ ను క్రాస్ చేసింది. మరి ఇటాలియన్, స్పానిష్ భాషల్లో విడుదలయ్యే థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో కిశోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఇంతటి ఘన విజయం తర్వాత కాంతార 2 గురించి అందరిలోనూ చర్చలు మొదలయ్యాయి. ఇక రిషబ్ శెట్టి కూడా ఈ చిత్రానికి భారీ స్థాయిలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Dasara: దసరా సినిమా నుండి కొత్త మాస్ లుక్‌ను రివీల్ చేసిన నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories