Homeసినిమా వార్తలుBalagam: నైజాంలో మైలురాయిని అందుకుని సంచలనం సృష్టించిన బలగం

Balagam: నైజాంలో మైలురాయిని అందుకుని సంచలనం సృష్టించిన బలగం

- Advertisement -

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన బలగం చిత్రం మార్చి 3న విడుదలై అప్పటి నుంచి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఒక అరుదైన మైలురాయిని దాటింది.

ఏ రకంగా చూసినా సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ అనదగ్గ స్థాయిలో కేవలం నైజాం ఏరియాలోనే మ్యాజికల్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్కును క్రాస్ చేసి నిర్మాతలకు ఊహించని వసూళ్లు తెచ్చిపెట్టింది. తెలంగాణలోని పల్లెల్లో వేళ్లూనుకున్న భావోద్వేగాలను, ఆత్మను పట్టుకున్న ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలు సొంతం చేసుకున్నారు.

చిన్నప్పటి ఎన్నో సంఘటనలను గుర్తు చేసుకునేలా ప్రేక్షకులను తమ నోస్టాల్జియాలోకి లాక్కు వెళ్ళింది ఈ సినిమా. పెళ్లి, చావు సమయంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను దర్శకుడు వేణు యెల్దండి చక్కగా తెరకెక్కించారు. ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాను రియలిస్టిక్ గా చిత్రీకరించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది, మరియు అన్ని వర్గాల నుండి వచ్చిన విశేషమైన ఆదరణ వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రయాణం ఎవరూ ఊహించని రీతిలో ముందుకు సాగింది.

READ  Balagam Review: బలగం రివ్యూ - సహజత్వంతో పాటు ఒక స్వచ్చమైన సామాజిక సందేశం ఉన్న సినిమా

మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు బలగం చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే దర్శకుడు వేణు కూడా ఇక చిన్న పాత్రలో కనిపిస్తారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories