Homeసినిమా వార్తలుKantara: కాంతార ప్రీక్వెల్ కాంతార 2 కన్ఫర్మ్ చేసిన నిర్మాత - ఇప్పటికే కథ రాస్తున్న...

Kantara: కాంతార ప్రీక్వెల్ కాంతార 2 కన్ఫర్మ్ చేసిన నిర్మాత – ఇప్పటికే కథ రాస్తున్న రిషబ్

- Advertisement -

కాంతార సినిమా భారీ విజయం సాధించినప్పటి నుండి దాని సీక్వెల్ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరియు తాజా నివేదికల ప్రకారం, రిషబ్ శెట్టి నిజంగా కాంతార 2 ను చేస్తారని ఆ చిత్ర నిర్మాత తెలిపారు. అయితే ఇది అందరూ అనుకుంటున్నట్లు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ గా తెరకెక్కనుందట.

కాగా ఇప్పటికే రిషబ్ శెట్టి ఇప్పటికే ఈ ప్రీక్వెల్ కు సంభందించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారని హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గ్రామస్తులు, దేవుడు, రాజుల మధ్య ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించే ప్రీక్వెల్ గా కాంతార రూపొందనుంది. కాంతార మొదటి భాగంలో గ్రామస్తులను, వారికి ఇచ్చిన భూములను రక్షించడానికి రాజు దేవునితో అంగీకరిస్తాడు కాని రాజు మనవడి అత్యాశ కారణంగా పరిస్థితులు అనుకున్న విధంగా జరగవు. ఈ మనిషి వర్సెస్ ప్రకృతి యుద్ధం అనే పాయింట్ ఏ ఈ సినిమా యొక్క ప్రధానాంశం.

READ  Mahesh Babu: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

ఇక కాంతార 2 కు కొంత భాగం షూటింగ్ కు వర్షాకాలం అవసరం అవుతుంది కాబట్టి జూన్ లో షూట్ చేయాలని భావిస్తున్నామని, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు విజయ్ కిర్గందూర్ తెలిపారు.

ప్రస్తుతం రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని అడవులకు వెళ్లి తన చిత్రం కాంతారలో చూపించిన జానపద కథల గురించి మరింత తెలుసుకోవడానికి రెండు నెలల రెక్కీ చేస్తున్నారు.

రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఫేమ్ రిషబ్ శెట్టితో పాటు కన్నడ ఇండస్ట్రీని నివ్వెరపోయేలా చేసింది.

కన్నడలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార భారీ విజయం సాధించడంతో హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. కిశోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.

READ  IMDB Top Movies in India for 2022: ప్రథమ స్థానాల్లో నిలిచిన RRR, కాంతార, విక్రమ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories