Homeసినిమా వార్తలుకాంతార ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేయనున్న నిర్మాతలు

కాంతార ఓటీటీ రిలీజ్ ను వాయిదా వేయనున్న నిర్మాతలు

- Advertisement -

గత కొన్ని రోజులుగా సినీ ప్రియులందరి చేతా విశేష స్థాయిలో ఆదరించబడుతున్న చిత్రం కాంతార. ఓ వైపు అద్భుతమైన ప్రశంసలను అందుకుంటూ మరో వైపు అన్ని చోట్లా థియేట‌ర్ల వద్ద సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 300 కోట్ల‌కు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఇంకా బాక్సాఫీస్ వద్ద తన లాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.

ఇదిలా ఉండగా కాంతార చిత్రాన్ని మొదట్లో నిర్మాతలు నవంబర్ 4 నాటికి OTTలో విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవటం చూసిన తర్వాత వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ రకంగా కాంతార OTT విడుదల తేదీ నవంబర్ 18కి వాయిదా పడింది.

నిజానికి కన్నడ పరిశ్రమ నుంచి ఒక చిన్న చిత్రంగా విడుదలైన కాంతార.. ఊహించని విధంగా రోజు రోజుకూ అన్నిరకాలుగా అద్భుతమైన స్పందన తెచ్చుకుని తెలుగు, హిందీ, తమిళ మరియు మలయాళ భాషల్లో విడుదల అయింది.ఇక విడుదలైన ప్రతి భాషలో కూడా కాంతార చిత్రం అద్భుతంగా ప్రదర్శింపబడింది.

READ  Unstoppable-2: ఓటీటీ వ్యూస్ లో సంచలనం సృష్టించిన బాలయ్య

ముఖ్యంగా తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమా దూసుకెళ్లింది. హిందీలో ఈ చిత్రం యొక్క నిలకడైన మరియు పటిష్టమైన రన్ చూసి ఆశ్చర్యపోవడం ట్రేడ్ వర్గాల వంతయింది.అందువల్లనే OTTలో తొందరగా విడుదల చేయడం ఎంతమాత్రం తెలివైన నిర్ణయం కాదని అందరూ భావించారు. ఎందుకంటే OTT విడుదల వల్ల థియేటర్లలో వాక్-ఇన్‌లకి తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

కాంతార ఒక గ్రామీణ ప్రాంత నేపథ్యంలో రూపొందిన జానపద థ్రిల్లర్‌ అవటం వలన ఆ సినిమాని థియేటర్ లోనే సరైన విధంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి OTT విడుదలను వాయిదా వేయడం వల్ల సినీ ప్రేమికులు కూడా థియేటర్‌లలో ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఎక్కువగా ఉండటం ప్రశంసనీయం.

అయితే ఇప్పటికీ కాంతార విడుదలై దాదాపు 7 వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద నెమ్మదించడం లేదు. ఈ క్రమంలో వినిపిస్తున్న తాజా వార్త ఏమిటంటే, OTT విడుదల తేదీని మార్చడానికి OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో సినిమా నిర్మాతలు మళ్లీ చర్చలు జరుపుతున్నారట. కొత్త OTT విడుదల తేదీ నవంబర్ నెలాఖరులో ఉంటుందని అంటున్నారు.

కాంతార సినిమాని యావత్ భారత దేశం లోని సినీ ప్రేక్షకులందరూ ఆదరించారు. మిగతా ఏ పరిశ్రమలో కూడా సరైన సినిమా లేకపోవడంతో థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి. బహుశా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ షేర్ సాధిస్తున్న సినిమా కాంతారనే. కావున కాంతార OTT విడుదలను నవంబర్ నెలాఖరుకి వాయిదా వేయడం అనేది సంపూర్ణంగా సమర్థించదగినదే అని అందరూ భావిస్తున్నారు.

READ  మరో భారీ ప్యాన్ ఇండియా సినిమా సీక్వెల్ లో నటించనున్న కాజల్ అగర్వాల్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories