కన్నడ చిత్రం కాంతార నిజానికి పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలయిన ప్రతి భాషలో కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్రదర్శన కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో పెట్టిన పెట్టుబడికి రెండు మూడు రోజుల్లోనే లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు మరిన్ని లాభాలను కూడా అందిస్తోంది.
కాంతార లాంటి సినిమా కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం అనేది ఒక సంచలనం అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు, హిందీలో ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ జరగలేదు. సక్సెస్ తర్వాత మాత్రమే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికీ ఈ సినిమా రోజులు గడుస్తున్న కొద్దీ వార్తల్లో నిలుస్తోంది.
తెలుగులో ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ కు 20 కోట్ల వరకు లాభాలను అందించిన ఈ సినిమా 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే హిందీలో కూడా కాంతారావు 50 కోట్లకు పైగా నెట్ రాబట్టేందుకు సిద్ధం అవుతుంది.
ఈ తరుణంలో సినిమా ఇతర భాషల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. వీకెండ్స్ వస్తే కాంతార తో పాటు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు ఎందుకంటే ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇప్పటి వరకు కాంతార బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రతి రోజుకి కోటి రూపాయలు వసూళ్లు రాబడుతోంది. అన్ని చోట్లా ఈ సినిమాకు స్క్రీన్‌లను పెంచుతూ పోతున్నారు. మరియు ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళం ఇలా అన్ని చోట్లా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
కాంతార సినిమా వసూళ్లు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్లు కంటే ఎక్కువగా ఉన్నాయి మరియు నిర్మాతలు ఈ సినిమాను OTTలో విడుదల చేయకపోతే అది సులభంగా మరో 100 కోట్లను రాబడుతోంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే కాంతార చిత్రం నవంబర్ 4 నుండి OTTలో ప్రసారం చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి అయితే ఈ చిత్రాన్ని OTTలో ప్రసారం చేయడానికి నిర్మాతలు కనీసం ఒక నెల వేచి ఉండాలని ట్రేడ్ వర్గాలు మరియు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.