కన్నడ చిత్రం కాంతార విడుదలైనప్పటి నుండి యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉడిపి మంగళూరు ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన భూతకోల కళ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 1887, 1970, 1990 సంవత్సరాల్లో గిరిజనుల కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. కర్నాటకలోని గిరిజనుల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ, భగవంతుడు విష్ణుమూర్తి అవతారాల్లో వరాహ రూపాన్ని చూపుతూ, మానవులంతా సమానమే అనే కాన్సెప్ట్‌తో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. . ‘కేజీఎఫ్’ నిర్మాతలైన హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.
కాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కాంతార సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదలై సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి పనితనం నచ్చిన అల్లు అరవింద్ ఈ ప్రతిభ గల నటుడు మరియు దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నట్లు తాజా సమాచారం.
ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టి వద్ద ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉందట, అయితే ఈ ఆలోచనతో సినిమా తీయాలంటే అందుకు భారీ బడ్జెట్ అవసరం మరియు అల్లు అరవింద్ వంటి నిర్మాతతో అయితే అలాంటి సినిమా చేయడం మరింత సులువైన పనిలా ఉంటుంది. అల్లు అరవింద్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జపాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్‌ను వివరించాలని వారు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ RRR జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి జపాన్‌లో ఉన్నారు.
ఇక కాంతార సినిమా దగ్గరకి వస్తే ఈ సినిమా ముందుగానే చెప్పినట్లు సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూలు చేసి 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు వెర్షన్లో కాంతార చిత్రం 20 కోట్లకు పైగా వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను ముందుగా మెచ్చుకున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా చూశానని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఆ తర్వాత అనుష్క కూడా ఈ సినిమా మిస్ అవ్వకూడదని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. తమిళ స్టార్లు ధనుష్, కార్తీ మరియు సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కాంతార సినిమాను అభినందించారు.
ఇక బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, శిల్పా శెట్టిలు కూడా కాంతార చిత్రాన్ని మెచ్చుకున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ సినిమాని ప్రశంసించిన జాబితాలో ఉన్నారు.