మ్యాజికల్ బ్లాక్ బస్టర్ కాంతార చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ పొందింది. ఈ చిత్రం దాదాపు 15-16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడగా.. ఇప్పుడు ఇది ఏకంగా ప్రభాస్ యొక్క సాహోను అధిగమించి 8వ అత్యధిక సౌత్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది.
కాంతార కంటే ముందున్న 7 సినిమాలు బాహుబలి2, కేజీఎఫ్, 2పాయింట్0, బాహుబలి, పొన్నియిన్ సెల్వన్, విక్రమ్. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా రూపొందిన కాంతార సినిమా 410 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సాహో పూర్తి రన్‌లో 405 కోట్లు వసూలు చేసింది, ఇక కాంతార దానిని అధిగమించి దక్షిణ భారత చలనచిత్రాలలో 8వ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ రోజుల్లో సౌత్ సినిమాలకు మంచి వసూళ్లు రావడానికి నార్త్ ఇండియా కూడా మంచి మార్గంగా మారింది.
నార్త్ ఇండియన్స్ కూడా రీజనల్ సినిమా అంటే ముఖ్యంగా ప్రాంతీయతత్వంతో నిండిన పల్లెటూరి యాక్షన్ సినిమాలంటే ఇష్టపడుతున్నారు. ఈ తరహా సినిమాలు బాలీవుడ్‌లో అన్వేషించబడలేదు మరియు తెలుగు, తమిళం మరియు కన్నడ సినిమాలు ఈ శూన్యతను తమ సినిమాల ద్వారా నింపుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ని కొత్త కాన్సెప్ట్‌లతో కలపడంలో నిష్ణాతులు కావడం కూడా మన సినిమాలకు ఉత్తరాది మార్కెట్‌లో మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
కాంతార సినిమాని రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో కూడా నటించారు. కాగా ఈ చిత్రం దైవిక అంశాలతో కూడిన జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో వినోదాన్ని మరియు దైవత్వాన్ని సమంగా చూపించారు.
అలాగే హీరో భూతకోల అనే జానపద కళను ప్రదర్శించే పాత్రలో కనిపిస్తారు, ఇది ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రభావం ఎలా ఉందంటే సినిమా చూసిన కొన్ని గంటల వరకూ ఆ ముద్ర నుండి ప్రేక్షకులు బయటికి రాలేక పోలేని స్థాయిలో ఉండటం విశేషం. ఈ సినిమా లో ఈ అంశమే ఎక్కువగా చర్చనీయాంశమైంది.