Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కించిన రిషబ్ శెట్టి, అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఈ సినిమా కంటెంట్‌కు ఇతర భాషా ప్రేక్షకులు సైతం సలాం కొడుతున్నారు.
ఈ సినిమాకు కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా కాంతార హిందీ వెర్షెన్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే అక్కడ రూ.38 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార మరో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీయఫ్’ లైఫ్‌టైం రికార్డును తొక్కేయడానికి రెడీగా ఉంది.
రాక్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-1 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.44 కోట్ల లైఫ్‌టైం కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పుడు కేజీయఫ్ రికార్డులను గల్లంతు చేసేందుకు కాంతార రెడీ అవుతోంది. ఈ లెక్కన కాంతార హిందీ బెల్ట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కేజీయఫ్ లైఫ్‌టైం రికార్డులకు ఎసరుపెట్టిన కాంతార టోటల్ థియేట్రికల్ రన్‌లో ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.